ప్రజాశక్తి-విశాఖ: మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని అంగన్వాడీలు విశాఖపట్నంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఐద్వా ఆల్ ఇండియా సెక్రెటరీ పుణ్యవతి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీస్ శర్మ మద్దతు పలికారు. మినీ సెంటర్లను మెయిల్ సెంట్రల్ గా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని, 42 రోజుల సమ్మె కాలంలో చేసుకున్న ఒప్పందాలకు జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ నేటికీ అంగన్వాడీలకు మేలు జరిగే ఒక్క పని కూడా చేయలేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కూడా అంగన్వాడీల గురించి ఒక ప్రస్తావన కూడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న అంగన్వాడీలకు నిరాశ మిగిలిందని మండిపడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చే జీవో కూడా ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి, తాము లేవనెత్తిన న్యాయమైన ప్రతి సమస్యను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఐద్వా ఆల్ ఇండియా కార్యదర్శి ఎస్ పుణ్యవతి, సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి మణి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి, దేవి, యూనియన్ గౌరవ సలహాదారు బృందావతి, కోశాధికారి కే పద్మావతి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శోభారాణి, యూనియన్ జిల్లా నాయకులు నర్సిమ్మ, కృప రాణి, సరస్వతి, శ్రీదేవి తదితరులు నాయకత్వం వహించారు.
అల్లూరి : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాడేరు బస్ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు.
అల్లూరి జిల్లాలో…
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మినీ అంగన్వాడీలకు సమాన వేతనం ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ పేపర్స్ యూనియన్ నేతృత్వంలో ధర్నా