విద్యార్థినిపై కరస్పాండెంట్‌ లైంగిక దాడి..

Aug 3,2024 08:15 #ananthapuram, #sexual harassment

అనంతపురం : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారి భవితకు బాటలు వేయాల్సిన పాఠశాల కరస్పాండెంట్‌ వికఅత చేష్టలకు పాల్పడ్డాడు. ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్‌ వివరాల మేరకు.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి అనంతపురం వచ్చి, నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తెను నెలన్నర కిందట నగరంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలలో చేర్చించారు. బాలిక పాఠశాల వసతిగఅహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుతోంది. గత బుధవారం మధ్యాహ్నం విద్యార్థిని భోజనం చేసి పళ్లేన్ని పైఅంతస్తులో ఉన్న గదిలో పెట్టేందుకు వెళ్లింది. ఆ సమయంలో పాఠశాల కరస్పాండెంట్‌ ఆంజనేయులు గౌడ్‌ బాలికను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గురువారం రాత్రి బాలిక తల్లికి ఫోన్‌ చేసి తనకు ఆరోగ్యం బాగాలేదని తెలిపింది. శుక్రవారం బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లికి జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో ఆమె టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుడు మరో బాలికపై కూడా వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.

➡️