నారాయణపేట (యాదాద్రి భువనగిరి) : కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగి రూ.2 కోట్లకు పైగానే ఆస్తి నష్టం జరిగిన ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపేట మండలంలో జరిగింది. లింగంపల్లి సమీపంలో భాగ్యలక్ష్మి కాటన్ మిల్ లో మంటలు రాజుకొని రైతుల నుంచి సేకరించిన పత్తి మొత్తం దగ్ధమయ్యింది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. సుమారు 8 వేల క్వింటాళ్లు పత్తి దగ్ధం అయినట్లు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
