హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. కొండా సురేఖ తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
