వరంగల్‌ జిల్లా స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన సీపీ

May 14,2024 13:15 #CP inspected, #strong rooms, #warangal

వరంగల్‌ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. కాగా, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వరంగల్‌ ఎనమాముల మార్కెట్‌లోని గోడౌన్లలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత కోసం ఏర్పాటు చేసిన మూడు అంచల భద్రత ఏర్పాట్లపై ఆయన పోలీస్‌ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఈవీఎంల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై పోలీస్‌ అధికారులకు సూచనలు చేశారు. కాగా, ఓటరు తీర్పు ఎటు వైపు ఉన్నదో జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనున్నది.

➡️