పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు స్థానాలలో సీపీఐ(ఎం) పోటీ

Feb 11,2024 16:01 #CPM State Committee, #prakatana

హైదరాబాద్‌: సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటేరియట్‌, రాష్ట్రకమిటీ సమావేశాలు 9,10 తేదీలలో హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగాయి. పార్టీ పొలిట్‌బ్యురో సభ్యులు బివి రాఘవులు, విజయరాఘవన్‌ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలను సమావేశం చర్చించింది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిభ్రవరి 16న జరిగే దేశవ్యాపిత సమ్మె, గ్రామీణబంద్‌కు మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కఅషి చేయాలని, ప్రజలంతా పాల్గని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇండ్లు, ఇండ్ల స్థలాల పోరాటం కొనసాగుతున్నది. ఈ పోరాటానికి పూర్తి మద్దతునిస్తూ, గుడిసెవాసులకు అండగా వుండాలని సమావేశం నిర్ణయించింది. ఈ పోరాటంలో పాల్గన్న వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, ఇండ్లు, ఇండ్ల స్ధలాలు లేనిపేదలకు వెంటనే కేటాయించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. కార్మికుల కనీస వేతనాల సమస్య మీద కేంద్రీకరించాలని నిర్ణయించింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాలలో పోటీ చేయాలని, స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.

➡️