ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ విద్యావేత్త, పౌరహక్కుల నేత ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. భౌతికంగా నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబా.. టెర్రరిస్టు నెపంతో దీర్ఘకాలం ఉపా చట్టం కింద చేయని నేరానికి జైల్లో మగ్గిపోయారని పేర్కొంది. బెయిలుపై విడుదలైన కొద్ది నెలలకే మరణించడం బాధాకరమని తెలిపింది. ఇది సహజ మరణం కాదని, ప్రభుత్వ నిర్బంధ ఫలితమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక వాదులను, మేథావులను వేధించడం తక్షణం నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
