క్యూబాకు వెల్లువెత్తిన సంఘీభావం

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ : ఆరు దశాబ్దాలకు పైగా అమెరికా క్రూరమైన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొంటూ సోషలిస్టు స్ఫూర్తిని చాటుతున్న క్యూబా ప్రజలకు సిపిఎం రాష్ట్ర మహాసభలో సంఘీభావం వెల్లువెత్తింది. క్యూబా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు ప్రతినిధులు రూ.63,035 నిధిని విరాళంగా అందించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ, బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌, డాక్టర్‌ కె.హేమలత, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.అరుణ్‌ కుమార్‌ జోలె పట్టుకొని విరాళం కోరగా, ప్రతినిధులు ఎవరికి వారు సహాయ నిధి అందించారు. కేవలం 20 నిముషాల్లోనే ఈ నిధి సమకూరింది.

➡️