ప్రజాశక్తి-విజయవాడ : తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలోని ఎయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ‘ప్రజావేదిక’ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ, రాష్ట్ర సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వైఖరులపై ఆయన మండిపడ్డారు. రెండు రోజుల పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా విజయవాడలోని బాలోత్సవ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ… తిరుపతిలో జరిగిన ఘటన విషాదకరమని తెలిపారు.