- సిపిఎం నేత బృందాకరత్ రాక
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ, బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. బోసుబొమ్మ, సుందరయ్య బొమ్మ, ఎసి సెంటర్, గాంధీబొమ్మ, మీదుగా ట్రంకురోడ్డు నుంచి విఆర్‌సి మైదానం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, ఎంఎ బేబి, బివి రాఘవులతోపాటు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు ఎంఎ గఫూర్, డి . రమాదేవితోపాట ఆపార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.ప్రదర్శన అగ్రభాగాన నేతలు, 27వ రాష్ట్ర మహాసభలకు సూచకంగా 27 మహిళలు ఎర్రచీరలు, అరుణపతాకాలతో ర్యాలీలో పాల్గొననున్నారు. డప్పులు, కోలాట దళం, విచిత్ర వేషదారణలు, తెనాలి బ్యాండ్, డిజేలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.