కాటూరు : కమ్యూనిస్టు పార్టీ శ్రేయోభిలాషి, అత్యున్నత మానవతావాది డాక్టర్ జ్యోతి (82) కన్నుమూశారు. ఆమెకు భర్త డాక్టర్ ప్రసాద్, పిల్లలు కుమార్తె శీతల్, కుమారుడు శరత్‌చంద్ర ఉన్నారు. కృష్ణా జిల్లా కాటూరుకు చెందిన నాగళ్ళ రాజేశ్వరమ్మ, జానకి రామయ్యల కుమార్తె జ్యోతి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎనస్తీషియన్ గా ఆమె ఇంగ్లండ్‌లో, దుబాయ్ లోనూ పనిచేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందించేవారు. ఆమె సాయంతో చాలామంది చదువుకొని స్థిరపడ్డారు. డాక్టర్ జ్యోతి మరణవార్త తెలిసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నాయకులు, సానుభూతిపరులు, సిపిఎం కృష్ణా జిల్లా కమిటీవారు ఆమెకు విప్లవ జోహార్లతో నివాళులర్పించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ జ్యోతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
