ప్రజాశక్తి-విజయవాడ : విద్యుత్ ఛార్జీల పెంపు చర్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజయవాడలోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ పై టిడిపి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. హమీని నెరవేర్చవలసిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఎత్తేసే విధంగా చర్యలకు పూనుకుంటుందని ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్ల కొనుగోలులో షిరిడీ సాయి కుంభకోణాలకు పాల్పడిందని టిడిపి పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ పాల్గొని మాట్లాడారు.