- ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాలు పంపిణీ
ప్రజాశక్తి- విజయవాడ : బుడమేరు, కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఎం, వివిధ ప్రజా సంఘాల వారు సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అజిత్‌సింగ్ నగర్, వాంబే కాలనీ, శాంతి నగర్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, న్యూ రాజీవ్ నగర్, కండ్రిక కాలనీ, నందమూరి నగర్, కనకదుర్గ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, ఉడా కాలనీ తదితర ప్రాంతాల్లో 2,500 మందికి ఆహారం, పాలు, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. సాయంత్రం సమయంలో మూడు వేల మందికి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, దోమల నివారణకు అగరబత్తీలను అందజేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో సిిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, ఆండ్ర మాల్యాద్రి, యువజన, విద్యార్థి నేతలు రామన్న, రాము, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.