CPM State Conference: జెండా ఆవిష్కరణ(ఫోటోలు, వీడియోలు)

నెల్లూరు : నెల్లూరులో జరుగుతున్న సిపిఎం ఏపి 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు.

 

దుమ్మలేపుతున్న ఎర్ర జెండా పాట

 

 

 

 

 

జెండా ఆవిష్కరించిన సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు, అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న  పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, రాఘవులు, సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు వెంకట్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు, జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు…

 

32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖస్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుంచి నెల్లూరుకు చేరిన జాత దివిటిని పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబికి అందిస్తున్న జాత బృందం..

రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసి కేంద్రప్రభుత్వం నిధులివ్వాలని, ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాడేపల్లి నుంచి నెల్లూరుకు చేరి పతాక జెండాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎ గఫూర్ కు అందిస్తున్న జాత బృందం..

 

సెకితో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలని నంద్యాల నుంచి నెల్లూరుకు చేరి పతాక జెండాను సిపిఎం సీనియర్ నాయకులు పి మధుకు  అందిస్తున్న జాత బృందం..

కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణం చేయాలని జమ్మలమడుగు నుంచి నెల్లూరుకు చేరి పతాక జెండాను సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు వెంకట్ కు అందిస్తున్న జాత బృందం..

 

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ పరిహారం కోసం కూనవరం మండలం నుంచి నెల్లూరుకు చేరి, పతాక జెండాను పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులుకు అందిస్తున్న జాత బృందం..

 

ఎర్ర పూల తోటలా ప్రాంగణం

 

ఉత్సాహభరితంగా కళాకారుల విప్లవ గీతాలు

 

 

పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర నాయకత్వం….

 

రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసి కేంద్రప్రభుత్వం నిధులివ్వాలని, ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాడేపల్లి నుంచి నెల్లూరుకు చేరిన జాత

 

కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణం చేయాలని జమ్మలమడుగు నుంచి నెల్లూరుకు వచ్చిన జాత

 

32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖస్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుంచి నెల్లూరుకు చేరిన జాత

సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలపై రాష్ట్రంలోని ఐదుచోట్ల నుంచి పతాక యాత్రలు

 

అమరవీరుల స్తూపంపై శ్రామికుల రూపం తీర్చిదిద్దిన కళాకారుడు…

➡️