ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టిటిడి అధికారులు తెలిపారు. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోందని తెలిపారు. నిన్న శనివారం 73,619 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని.. అందులో 25,112మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వచ్చినట్లు తెలిపారు.