వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోండి.. అధికారులకు సీఎస్‌ ఆదేశం

Jun 8,2024 12:29 #CS order, #flood water, #officials

హైదరాబాద్‌ : భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్‌ జామ్‌, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఆమె సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాటర్‌ బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు పాల్గన్నారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.

➡️