Cyclone Michaung Effect : విశాఖ నుంచి 23 విమానాలు రద్దు

విశాఖపట్నం : మిచౌంగ్‌ తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వెల్లడించారు. ఈమేరకు విశాఖ నుంచి 23 విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ” విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపుల కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 గంటల వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం” అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు.

➡️