నేటి నుంచి డి సెట్‌ హాల్‌ టికెట్లు..

May 17,2024 08:38 #deecet exams, #Exams
  • మే 24న ప్రవేశ పరీక్ష

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డి సెట్‌-2024కు సంబంధించిన హాల్‌ టికెట్లను శుక్రవారం నుంచి వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 24న పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డి సెట్‌-24 కోసం గత నెల 22న నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను http//:cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఏవైనా తప్పులున్నట్లయితే 8125046997, 8121947387 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయాలని కోరారు. అధికారులు తప్పులను సవరించి, హాల్‌ టికెట్లను తిరిగి వెబ్‌సైట్‌లో పెడతారన్నారు.

➡️