దగా డీఎస్సీని రద్దు చేయాలి : ఏఐవైఎఫ్‌

Feb 11,2024 12:57 #Mega DSC
  • మెగా డీఎస్సీ కోరుతూ సీఎం ఇంటి ముట్టడికి ఏఐవైఎఫ్‌ పిలుపు
  • ఉద్రిక్తత..నాయకులు అరెస్ట్‌

ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టుల సంఖ్య 6వేల 100 నుంచి 23 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏఐవైఎఫ్‌.. చలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు పిలుపు ఇవ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సీపీ కార్యాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరిన ఏఐవైఎఫ్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఏఐవైఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ.. డీఎస్సీ పోస్టుల సంఖ్య 23 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. దగా డీఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

➡️