దళిత క్రిస్టియన్లను ఎస్‌సిలుగా గుర్తించాలి : కెవిపిఎస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళిత క్రిస్టియన్లను ఎస్‌సిలుగా గుర్తిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా దళిత క్రిస్టియన్లను ఎస్‌సిలుగా గుర్తించాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి గురువారం ఒక ప్రకటనలో కోరారు. చట్టపరంగా ఇందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలన్నారు. మతం మారినంత మాత్రాన కులవివక్ష పోలేదని, అంటరానితనం కొనసాగుతూనే ఉందని, కుల దురహంకార దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో దళితులకు కల్పించిన మౌలిక హక్కులను మతంతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తించేలా చట్టాన్ని సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

➡️