దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలిశ్రీసిపిఎం డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది.దళితులు క్రిస్టియన్‌ మతంలోకి మారిన మరుక్షణం ఎస్సి హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఏ మతంలోకి మారినా దళితులు అంటరానితనానికి, వివక్షతకు గురవుతూనే ఉన్నారని పేర్కొన్నారు. క్రిస్టియానిటీ కులాన్ని గుర్తించకపోయినా కులవివక్ష కొనసాగుతుందని అనేక నివేదికలు వెల్లడించాయని తెలిపారు. దేశంలో కులం మతంపై ఆధారపడి లేదని, వ్యవస్థీకృతమై ఉందని పేర్కొన్నారు. కులం పునాదుల్ని తొలగించడానికి అవసరమైన రాజకీయ, ఆర్ధిక, సామాజిక చర్యల్ని తీసుకోవాలని పేర్కొన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలని, అందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాని ఆయన డిమాండ్‌ చేశారు.

హైకోర్టు తీర్పు బాధాకరం : కెవిపిఎస్‌

క్రిస్టియన్‌ మతంలోకి దళితులు మారిన మరుక్షణమే ఎస్‌సి హోదా కోల్పోతారని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని కెవిపిఎస్‌ పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ మతంలోకి మారినా దళితులు అంటరానితనానికి, వివక్షకు గరవుతూనే ఉన్నారని అన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్‌సిలుగా గుర్తించేందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️