ఎఐసిటిఇతో కలిసి ఉన్నత విద్యామండలి ఏర్పాటు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వేసవి కాలంలో డిగ్రీ విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్ అందించేందుకు ఎఐసిటిఇతో కలిసి ఉన్నత విద్యామండలి డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ఈ డ్యాష్‌బోర్డును ఉన్నత విద్యామండలి చైర్మన్ కె మధుమూర్తి ఎఐసిటిఇ చీఫ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్, మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ పార్ధసారధిలతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.విద్యార్ధులకు మూడు రకాల ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టయిఫండ్ ఆధారిత, ఉచిత ఇంటర్న్‌షిప్, నగదు చెల్లించడం వంటి ఉన్నాయి. విద్యార్ధులు internship.aicte-india.org వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ట్యాబ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని నమోదు చేసుకోవాలి. స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ ఎంపిక చేసుకున్న విద్యార్ధులు ఆపార్ ఐడి, ఫోన్ నెంబర్‌ను కచ్చితంగా చేయాల్సి ఉంది. ఎఐసిటిఇ డ్యాష్‌బోర్డులో త్వరలోనే icc.apsche.ap.gov.in పోర్టల్‌ను ఉన్నత విద్యామండలి ప్రారంభించనుంది.
