టిడిపి కార్యాలయంలో రోజుకొక మంత్రి, నేత

Jul 17,2024 07:29 #ministers, #tdp ofice
  • నేటి నుంచి అందుబాటులోకి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి కార్యాలయంలో ప్రతిరోజూ ఒక మంత్రి, ఒక పార్టీ సీనియర్‌ నేత అందుబాటులో ఉండనున్నారు. పార్టీ నాయకులు, శ్రేణుల కోసం అందుబాటులోకి ఉండాలని ఇటీవల టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రతి శనివారం ప్రజావేదిక పేరుతో పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన రోజుల్లోనూ ఈ వినతులను స్వీకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ అందుబాటులో ఉండనున్నారు. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండే మంత్రి, పార్టీ నేతల పేర్లను టిడిపి కార్యాలయం మంగళవారం విడుదల చేసింది.

మెల్‌బోర్న్‌లో టిడిపి విజయోత్సవాలు
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో టిడిపి గెలుపు సంబరాలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటులు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఐ టిడిపి తరపున ప్రకటించిన రూ.లక్ష ఉద్యోగాల హామీని అమలుపరచాలని కోరారు. సోషల్‌ మీడియాలో వైసిపి చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. మెల్‌బోర్న్‌ టిడిపి అధ్యక్షులు లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యాన ఈ వేడుకలు జరిగాయి.

➡️