కాంగ్రెస్‌ వైఫల్యంతోనే హర్యానాలో ఓటమి

సిపిఐ నారాయణ
ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ (తిరుపతి జిల్లా) : హర్యానాలో ఓటమి కాంగ్రెస్‌ వైఫల్యమే తప్ప.. ఇండియా వేదికది కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రయివేట్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానాలో తాము గెలుస్తామన్న ధీమాతో మిత్ర పక్షాలను పట్టించుకోకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైందన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇండియా వేదిక విజయం సాధించాలంటే అన్ని పార్టీలను కలుపుకొనిపోవాలని సూచించారు.. జమ్మూ కాశ్మీర్‌లో ఇండియా వేదిక విజయం శుభపరిణామన్నారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని తెలిపారు. ఉచిత ఇసుకను పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా పరిగణించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తుంటే సిఎం చంద్రబాబు ఎందుకు కినుకు వహిస్తున్నారని స్పందించడం లేదన్నారు. ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రభాకర్‌, శశికుమార్‌, కాలేషా పాల్గన్నారు.

➡️