ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిగ్రీ మూడోదశ అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10, 11 తేదీల్లో, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 11, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆప్షన్ల ఎంపిక 14వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఈ నెల 15న ఉంటుందని తెలిపారు. సీట్ల కేటాయింపు 18న ఉంటుందని వివరించారు. ఈ నెల 21వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో చేరాలని వెల్లడించారు.
