పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన

Mar 31,2024 23:22 #CPI, #prakatana

– సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సామాజిక పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన చేపడతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పెన్షన్‌దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓట్ల ప్రయోజనాల కోసం వలంటీర్లను అడ్డగోలుగా వైసిపి ప్రభుత్వం వాడుకోవటాన్ని ఎన్నికల సంఘం గమనించిందని అన్నారు. అందుకనే వారిని పక్కన పెట్టాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

➡️