సమగ్రంగా రీ సర్వే : కెవిపిఎస్‌ డిమాండ్‌

Jan 17,2025 23:35 #Caste Census, #KVPS

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తును సోషల్‌ ఆడిట్‌ ఇన్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ గడువును పెంచి, సమగ్రంగా రీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వానిు కెవిపిఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకుకెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు, సహాయ కార్యదర్శి జి నటరాజ్‌, జి క్రాంతికుమార్‌ శుక్రవారం సాంఘిక సంక్షేమశాఖ కమిషనరుకు వినతిపత్రం అందజేశారు. ఎస్‌సి వర్గీకరణలో భాగంగా పరిశీలన కోసం నియమించిన ఏకసభ్య కమిషన్‌కు రిపోర్టు ఇవ్వడం కోసం ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా నివేదిక తయారుచేశారని తెలిపారు. లిస్టుల్లో అనేక తప్పులు దొర్లాయనాురు. వలంటీర్ల ద్వారా గ్రామ విఆర్‌ఒలు సర్వే చేయకుండా, వ్యక్తులను అడగకుండా పేరును బట్టి కులం, మతం డిసైడ్‌ చేసి నివేదికలు తయారు చేశారనివారు విమర్శించారు. నివేదికంతా తప్పుల తడకగా ఉందని, హిందువులను క్రిస్టియన్‌ బిసిలుగా చూపారని, ఫలితంగా ఎస్‌సి రిజర్వేషన్లు కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి వార్డు సభ్యులకు ఫోన్‌ చేయడం లేదా చాటింపు లేదా మైక్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️