ఇల్లు కూల్చివేత – వ్యక్తి మృతి

Feb 22,2024 12:09 #death, #Demolition, #house, #person

తెలంగాణ : ఇంటిని కూలుస్తుండగా.. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. స్థానిక కథనం మేరకు …. మూసాపేటలో మాజీ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు. దానికి ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. ఈరోజు ఉదయం పాక్షికంగా పనులు ప్రారంభించగా, భోజన విరామం అనంతరం పూర్తిగా కూల్చివేశారు. ఇంటిలో స్వామి రెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉండేవారు. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల స్వామి రెడ్డి నిద్రపోయాడు. ఆ విషయం తెలియకుండా పూర్తిగా ఇంటిని కూల్చివేయడంతో స్వామి రెడ్డి శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మఅతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️