ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల జిల్లా):ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకముందే టిడిపి నేతలు ధ్వంస రచన మొదలుపెట్టారు. ‘వైసిపి నగుబాటు’ పేరుతో బాపట్ల జిల్లా భట్టిప్రోలులోని జగనన్న కాలనీలో వైసిపి పాలనలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో నాయకులు ధ్వరసం చేశారు. వైసిపి ఎన్నికల గుర్తును తగులబెట్టారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ..కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా శిలాఫలకాలకు పరిమితమైన నేపథ్యంలో ఆ శిలాఫలకాలను తొలగించి టిడిపి ప్రభుత్వ పాలనలో జరగనున్న అభివృద్ధితో మరో శిలాఫలకాలు రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు.
