తెలంగాణ : మలక్‌పేట పరిధిలోని శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లో నిర్వాసితులు ఖాళీ చేసిన ఇండ్లను అధికారులు మంగళవారం కూల్చివేశారు. నిర్వాసితులంతా స్వచ్ఛందంగానే తమ ఇండ్లను ఖాళీ చేశారు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు. మరోవైపు అంబర్‌పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసి రామ్ నగర్‌లో మూసీ పరీవాహక ప్రాంత వాసులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఈ కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్పందించారు. తమ ఇళ్లు కూల్చడానికి వారు ఎవరు..? ఇళ్లు కూల్చి ఇక్కడ పార్కులు కడతారా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.