పిఠాపురం : తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదు. అటువంటి నాకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారు. నా గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారు. నా జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటాను. మీ బలం వలన రెండు లక్షల 8 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. నా గెలుపు ఆంధ్ర ఆత్మ గౌరవం. రాష్ట్రంలో మౌళిక సదుపాయాల అభివృద్ధి కావాలి. తాజాగా తిరుమలలో జరిగిన ఘటన బాధ కలిగించింది. సంక్రాంతి కి పిఠాపురంలో ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నాను. కానీ తిరుమల ఘటనతో తగ్గించి చేస్తున్నాను. కుదిరితే దసరా బాగా చేసుకుందాం.” అని ఆయన అన్నారు.
“ఓట్లు కోసం బుగ్గలు నిమరడం, తల కాయలు నిమరడం కాదు’ అని ఆయన జగన్ ని విమర్శించారు. గత ప్రభుత్వాన్నీ నడిపిన పెద్ద మనుషులకు ఈ ఆరు నెలలు పాలన పట్ల తృప్తి లేదట అని అన్నారు. గత ప్రభుత్వం స్కామ్ లలో రికార్డు సృష్టిస్తే.. తమ ప్రభుత్వం అభివృద్ధిలో రికార్డు సృష్టించిందని అని అన్నారు.