నేడు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో శుక్రవారం ఒక రోజు పర్యటన ఖరారైంది. ఉదయం 9గంటలకు మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బై రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకుంటారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బై రోడ్డు మార్గంలో 12 గంటలకు కాకినాడ చేరుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సమీక్షలకు అవకాశలేదు. కాకినాడ పోర్టుతో పాటు పలుచోట్ల తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అరబిందో ఫార్మా బాధితులను కలిసే అవకాశం. పర్యటన అనంతరం సాయంత్రం మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు.

➡️