డిప్యూటీ సీఎం పవన్‌, హోం మంత్రి అనిత భేటీ

ప్రజాశక్తి-అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. ఫేక్‌ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను పవన్‌ కల్యాణ్‌కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు.

➡️