TG: 10మంది కానిస్టేబుళ్లను తొలగించిన ఎడిజి

Oct 28,2024 08:41 #Constable, #Telangana

హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న కానిస్టేబుల్ ఆందోళనకు టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కారణమని తెలంగాణ ఎడిజి పేర్కొన్నారు. దీంతో వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ చేస్తూ ఎడిజి కార్యాలయం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.  పదిమంది కానిస్టేబుల్ వల్లనే మిగతావాళ్లు ఆందోళనకు దిగారని పేర్కొంది. 3వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ జి.రవికుమార్‌.. 6వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎస్‌కే షరీఫ్‌.. 17వ బెటాలియన్‌ ఏఆర్‌ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్‌.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్‌.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూనిఫామ్, క్రమశిక్షణ గల ఫోర్సులో ఆందోళనలు చేయడం ఆర్టికల్ 311కు విరుద్ధమని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలు చేయడం, న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసి ఆందోళనలను ప్రేరేపించడం ఆర్టికల్ 311కు విరుద్ధమని తెలిపారు.

 

➡️