ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మండల పరిధిలోని రావులచెరువు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో టిడిపి జెండా ఎగుర వేసేది కూడా తానే అని అన్నారు. ఎవరో మాట్లాడే గాలి మాటలు అసలు పట్టించుకోవద్దని, ఎలాంటి అనుమా నాలకు తావు ఇవ్వరాదని అన్నారు. ధర్మవరం లో ఎలాంటి గందరగోళానికి తావు లేదని కచ్చితంగా ఈసారి టిడిపి జెండా ఎగరవేయ డం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు.
