రేపు పాలకొల్లులో డయాలిసిస్‌ కేంద్రం ప్రారంభం

Mar 13,2025 09:14 #100-bed hospital, #Palakollu

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన డయాలిసిస్‌ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ రేపు(శుక్రవారం) ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు డయాలిసిస్‌ కేంద్రాలు మంజూరు కాగా దానిలో పాలకొల్లు ఒకటి. పాలకొల్లులో గతంలో టిడిపి ప్రభుత్వంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రికి అప్పటి ఎమ్మెల్యే రామానాయుడు కృషితో రూ.12.60 కోట్లు మంజూరయ్యాయి. గత వైసిపి ప్రభుత్వంలో పూర్తి కావలసిన ఈ పనులు ఐదేళ్లు గడిచిన పూర్తి కాలేదు. జరిగిన పనుల్లోనూ అడుగడుగునా నాణ్యత ప్రమాణాలు లోపించి ప్రారంభానికి నోచుకోక ముందే పలుచోట్ల బీటలు తీశాయి. ఈ దశలో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి రామానాయుడు చొరవ తీసుకొని పనులు శరవేగంగా జరిగేలా దృష్టి సారించారు. అందులో భాగంగా పనులు జరుగుతున్నాయి.

➡️