ఎఎస్‌ఒలుగా డిజిటల్‌ అసిస్టెంట్లు

  • జిఒ 20 విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లను ఖాళీగా ఉన్న మండలాల్లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసరు (ఎఎస్‌ఒ)గా ప్రభుత్వం నియమించనుంది. ఇందుకు సంబంధించిన జిఓ ఆర్‌టి నెంబరు 20ను ప్లానింగ్‌ డిపార్టుమెంట్‌ శుక్రవారం విడుదల చేసింది. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ అమలు చేసే కార్యక్రమంలో భాగంగా విద్యార్హతతో పాటు అర్హత ఉన్న 277 మంది డిజిటల్‌ అసిస్టెంట్లకు ఎఎస్‌ఒగా ప్రమోషన్‌ దక్కనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలంటూ ప్రభుత్వం పేర్కొంది.

➡️