దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా వీడియో

ఇంటర్నెట్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు సోదాలు చేస్తున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో… తాను కేసులకు భయపడటం లేదని పేర్కొన్నారు. తాను సంవత్సరం క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వారి మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇలా పెట్టిన కేసులు, సెక్షన్లు తను ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలో ఉన్న వాటిని వినియోగించి తనపై కుట్ర పన్నుతున్నారని… రాజకీయ పార్టీల నాయకులు పోలీసులు వ్యవస్థను ఉపయోగించి తమకు గిట్టని వారిపై కేసులు పెట్టడం ప్రపంచ దేశాల్లో జరుగుతుందని తెలిపారు. తనకు వచ్చిన నోటీసుకు సినిమా షూటింగ్ కోసం కొంత వ్యవధి కావాలని సమాధానం చెప్పానని, అయితే ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదని తెలిపారు. మధ్యలో షూటింగ్ ఆపేస్తే నిర్మాతకు నష్టం వస్తుందని, అందుకే మరింత సమయం కావాలని అడిగానని తెలిపారు. సంవత్సర క్రితం జరిగిన దానిపై కేసు పెడితే వెంటనే విచారణ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక కావాలనే మరేదో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసుల రెండు బృందాలు హైదరాబాద్‌లో, ఒక బృందం తమిళనాడులో సోదాలు నిర్వహిస్తున్నాయి.

➡️