పెన్షన్ల తగ్గింపుపై ఏపీ శాసనమండలిలో చర్చ

ప్రజాశక్తి-అమరావతి : పెన్షన్ల తగ్గింపుపై ఏపీ శాసనమండలిలో చర్చ జరగుతోంది. వివిధ కారణాలతో పెన్షన్లు తొలగిస్తున్నారని.. 2 లక్షల పెన్షన్లు తొలగించారని.. ఏ విధానాలతో పెన్షన్లు తొలగిస్తున్నారని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి సమాధానమిచ్చారు. 2 లక్షల పెన్షన్లు తొలగించామనడం అవాస్తవం అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక లక్షా 80 వేల మంది చనిపోయారని.. అనర్హులైన 14 వేల మందిని మాత్రమే తొలగించామన్నారు. హెల్త్‌ పెన్షన్‌కు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు.

➡️