హైదరాబాద్ : గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిసిసి) విలువ పెంపులో ఎఐ పాత్ర, రెండవ తరం ఎఐలో సవాళ్లు, అవకాశాలపై ‘ఫోర్గ్‌వర్డ్స్’ జిసిసి రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. దీన్ని హైదరాబాద్‌లో ఎఐ ఇంజనీరింగ్ సంస్థ గాలెంట్ నిర్వహించింది. మొత్తం 60 మంది జిసిసి లీడర్లు, 12కి పైగా ఫార్చ్యూన్ 200, 25కి పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 5 లక్షలకుపైగా ఉద్యోగులను నిర్వహిస్తున్న వారు, ప్రధాన పరిశ్రమ రంగాలన్నింటినుండి ఈ సమావేశంలో భాగమయ్యారని గాలెంట్ వర్గాలు తెలిపాయి. దీనికి కాగ్నిజెంట్ మాజీ సిఇఒ ఫ్రాన్సిస్కో డిసౌజా, థాట్‌లింక్స్ చీఫ్ సుబీత్ చాబ్రియా, గాలెంట్ సిఇఒ అశ్విన్ భరత్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రెవెచర్ హాజరై ఎఐలోని అవకాశాలు, సవాళ్లపై మాట్లాడారు.
