కారంపూడిలో వైసిపి నాయకుల బీభత్సం

ప్రజాశక్తి-కారంపూడి : కారంపూడి పట్టణంలో వైసిపి నాయకులు బీభత్సం సృష్టించారు. మండలంలోని పేట సన్నగండ్ల గ్రామంలో రాత్రి కొందరు వైసిపి నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై టిడిపి శ్రేణులు రాయి విసిరటంతో వివాదం చెలరేగింది. దీంతో భారీ కాన్వారుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి రావటంతో వైసిపి శ్రేణులు రాడ్లు, కర్రలతో పట్టణంలో హల్చల్‌ చేశారు. రోడ్డు వెంట కనిపించిన వారిపై దాడులు చేయటం, టిడిపి ఆఫీసును, టిడిపి సానుభూతిపరులు ఇళ్లను, హౌటల్లను ధ్వంసం చేయడం చేశారు. ఈ ఘర్షణలో సిఐ నారాయణస్వామికి గాయాలయ్యాయి. ఆయన్ను దగ్గరల్లోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోవడంతో గ్రామంలో కేంద్ర బలగాలను మొహరించారు. దుకాణాలను పూర్తిగా ముయించి 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

➡️