ప్రభావతి పిటిషన్‌ డిస్మిస్‌

ప్రజాశక్తి-అమరావతి : డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు ఎంపిగా ఉండగా పోలీసులు కొట్టారంటూ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు, నగరపాలెం పోలీసులు పెట్టిన కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి అప్పటి సూపరింటెండెంట్‌ నీలం ప్రభావతికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభావతిపై ఉన్న కేసులో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని జస్టిస్‌ విఆర్‌కె కృపాసాగర్‌ తీర్పు చెప్పారు.

➡️