ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు

May 17,2024 08:13 #MLC Janga Kashnamurthy, #suspended
  •  వివరణ తీసుకోకుండా చర్యలా? : జంగా

ప్రజాశకి-గుంటూరు జిల్లా ప్రతినిధి : శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్‌ కొయ్యే మోషెన్‌ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైసిపి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన రెండు నెలల క్రితం టిడిపిలో చేరారు. వైసిపి పాలనపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జంగాపై చర్యలు తీసుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెెడ్డి మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్‌ విచారించి చర్యలు తీసుకున్నారు. తనపై అనర్హత వేటు వేయడాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఖండించారు. తన నుంచి వివరణ తీసుకోకుండా చర్య తీసుకున్నారని ఆయన గురువారం గుంటూరులో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం పార్టీ మారిన వారిపై ఎన్నికల ముందు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 2011లో వైసిపిలో చేరిన బిసి నాయకుడిని తాను ఒక్కడినేనని ఆయన తెలిపారు. గురజాల ఎమ్మెల్యే టికెటు ఇస్తానని చెప్పి జగన్‌ మాట తప్పారన్నారు. టిడిపిలో గెలిచి వైసిపిలో చేరిన ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. వైసిపిలో బిసిలకు పదవులు ఇవ్వలేదని, బిసిలకు తగిన గౌరవం లేకపోవడం వల్లే తాను టిడిపిలో చేరినట్టు తెలిపారు.

➡️