ప్రజాశక్తి- అమరావతి : ఏపీ వక్ఫ్ బోర్డు విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించి. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.