- పర్యటనలో స్వల్ప మార్పు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి, అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించాల్సి ఉంది. వాతావరణంలో మార్పులు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఓర్వకల్లు మండల కేంద్రానికి ఈ కార్యక్రమం మార్పు జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఓర్వకల్లులోని సభా ప్రాంగణానికి వచ్చి పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ పింఛనుదారులతో ముఖాముఖి నిర్వహించి ప్రసంగించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్ వెళ్లనున్నారు.