‘బర్డ్‌’లో రోగులకు కత్రిమ అవయవాల పంపిణీ

Jun 8,2024 21:01 #Bird Hospital, #Distribution, #organs

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుపతి నగరంలోని బర్డ్‌ ఆస్పత్రిలో 110 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇటీవల తమిళనాడు ధర్మపురికి చెందిన దాత సుబ్రమణియన్‌ బర్డ్‌ ఆస్పత్రిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీకరణకు రూ.కోటి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యుకె సాంకేతిక సహకారంతో ఎండోలైట్‌ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతిక సహకారంతో తయారు చేసిన ఎక్కువ మన్నిక గల కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించారు. బర్డ్‌ ఆస్పత్రి చేస్తున్న సేవలకుగాను ఎండోలైట్‌ కంపెనీ వారు అసలు ధరలో 50 శాతం రాయితీతో అల్యూమినియంతో తయారు చేసిన ఈ కత్రిమ అవయవాలను టిటిడికి అందించారు. వీటిని ధరించిన రోగులు సాధారణ వ్యక్తుల్లాగే అత్యంత సులభంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతుమని రోగులు తెలిపారు. ఇదివరకు తాము జైపూర్‌, ఇతర ప్రాంతాల్లో తయారైన కృత్రిమ అవయవాలను ఉపయోగించామని, వాటికంటే కూడా ఈ అవయవాలు సౌకర్యవంతంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్‌ ఆస్పత్రి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, రోగుల బంధువులు పాల్గొన్నారు.

➡️