- వరద బాధితులకు రూ.5.90 కోట్లు భారీ విరాళం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వరద బాధితుల్ని ఆదుకునేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు రూ.5.90 కోట్లు భారీ విరాళం ప్రకటించారు. సిఎం చంద్రబాబును సోమవారం బ్యాంక్ ప్రతినిధులు, ఉద్యోగులు కలిసి ఒకరోజు వేతనం రూ.5,90,01,087 వరద బాధితులకు విరాళం ప్రకటించారు. ఆ బ్యాంక్ ఎమ్‌డి అండ్ సిఇఒ ఎ మనిమేఖలై ఇందుకు సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులను సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఎస్ రామ సుబ్రహ్మణియన్, జనరల్ మేనేజరు అండ్ ఎస్‌ఎల్‌బిసి కన్వీనరు సివిఎన్ భాస్కరరావు, యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.