ప్రజాశక్తి-మంగళగిరి : పశ్చిమ బెంగాల్లో వైద్యురాలపై జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ మంగళగిరి ఎయిమ్స్ లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, అధికారులు, వైద్య సిబ్బంది ధర్నా చేశారు. భారతదేశంలో డాక్టర్లకు రక్షణ లేకుండా పోతుందని నినాదాలు చేశారు. రక్షణ కల్పించకపోతే ఆందోళన ను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
