అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కోర్టు వేసిన చార్జెస్ లో తన పేరు లేదు అని జగన్ చెబుతున్నారు. అయితే మరి నీ హయంలో జరిగిన దానికి నువ్వు కాక ఎవరు బాధ్యత వహించాలి? అదానీ డబ్బు నువ్వు తినకపోతే ఎవ్వరు తిన్నారో నువ్వే చెప్పు. ఈ ఒప్పందాల్లో పోరపాటు జురిగింది.. డబ్బు తిన్నాను ’ అని ఆయన అన్నారు. జగన్ నిజమైన క్రైస్తవుడు కాదు ఈస్టిండియా కంపెనీ లాగా, వారన్ హెస్టింగ్స్ లాగా రాష్ట్రప్రజలను దోచుకున్నాడు. మదర్ థెరీసా లాగా సేవ చేసే క్రైస్తవుడు జగన్ కాదని మాణిక్య వరప్రసాద్ విమర్శించారు.
నా ఎస్సీ లు, బీసీ లు అని చెబుతూ వారికే అన్యాయం చేశాడు. అటు రెడ్డి వర్గానికి చెందిన వారు కూడా జగన్ తీరుతో అవమానం గా ఫీల్ అవుతున్నారన్నారు. అమెరికా కోర్టలో వేసిన ఛార్జిషీట్ లో జగన్ పేరు కచ్చితంగా వుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మోసానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుందని, సెకీతో ఒప్పందం విషయంలో తప్పించుకోవలనుకుంటే కుదరదన్నారు. ఇక్కడి పోలీసుల నుండి మాయచేసి తప్పించుకున్నా అమెరికాలో జగన్ కు శిక్ష తప్పదని, నువ్వు తప్పు చేయకపోతే ఒక సారి అమెరికా వెళ్ళి రావాలని మాణిక్యవరప్రసాద్ జగన్ కు సవాలు విసురారు. ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, అదాని కేసు వ్యవహారం పార్లమెంట్ లో చర్చ జరుగాలని ఆయన అన్నారు.