వరద సహాయనిధికి విరాళాలు ఇవ్వండి

Sep 10,2024 00:45 #Donation, #Floods in AP, #mbvk

 ఎంబి విజ్ఞాన కేంద్రం విజ్ఞప్తి
ప్రజాశక్తి – విజయవాడ : గతంలో ఎన్నడూ లేనివిధంగా బుడమేరు, కృష్ణానది వరదలతో విజయవాడ ప్రాంత ప్రజలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయినందున దాతలు సహాయం అందించాలని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టు చైర్మన్‌ పి.మధు, కార్యదర్శి పి.మురళీకృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వరదలు వచ్చి పది రోజులైనా ఇంకా వేలాది గృహాల్లో నీరు బయటకు పోలేదని, బట్టలు, విద్యుత్‌ పరికరాలు, ఆహార దినుసులు సర్వస్వం పనికి రాకుండా పోయాయని తెలిపారు. నీరు తగ్గినా కోలుకోవడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంబి విజ్ఞాన కేంద్రం సహాయక చర్యలు చేపట్టిందని, అక్కడే ఆహారం వండించి పంపిణీ చేస్తోందని తెలిపారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్‌ కేంద్రాల ద్వారా సేవలు అందించిందని, ప్రజలు కోలుకొనే వరకు భరోసా కల్పించి వివిధ రూపాల్లో సాయం అందించిందని గుర్తుచేశారు. తాజాగా సంభవించిన వరద సహాయ నిధికి దాతలు విరివిగా విరాళాలు పంపాలని కోరారు. వివరాళాలు పంపాల్సిన అకౌంట్‌ వివరాలను వెల్లడించారు.

A/c name: MAKINENI BASAVA PUNNAIAH VIGNANA KENDRAM A/C number : 37665461532.
IFS code : SBIN0020343 (Current Accounts)
PAN NO: AADTM8426F
GST NO: 37AADTM8426F1ZF

➡️